ఒకేరోజు 1006 మొక్కలు నాటిన బలరాం IRS..

163
N.Balaram IRS

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్‌ బలరాం ఈ సీజన్లో 10 వేల మొక్కలు నాటడానికి నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా నేటితో 9006 మొక్కలు నాటడం పూర్తి చేశారు. త్వరలోనే 10,000 వేల మొక్కల లక్ష్యం పూర్తి చేస్తానని తెలిపారు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం తెలంగాణకు హరితహారం అని, అలాగే సంతోష్ కుమార్ మెంబర్ అఫ్ పార్లమెంట్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందులో భాగంగా ఈ రోజు ఛాలెంజ్ స్వీకరించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధుల సమక్షంలో శ్రీరాంపూర్ ఏరియాలోని సిసిసిలో 1006 మొక్కలను నాటడం జరుగుతుందని చెప్పారు. బలరాం ఇప్పటివరకు ఎనిమిది వేల మొక్కలు నాటానని ఈరోజుతో 9006 మొక్కలు నాటుతున్నటు అవుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం బలరాం మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక ఛాలెంజ్‌గానే కాకుండా ఒక అలవాటుగా చేసుకుని మానవ జాతి మనుగడకు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని.. ఒక వ్యక్తికి సంవత్సరానికి కావలసిన ఆక్సిజన్ను మూడు ముక్కలు కలిసి ఇవ్వగలదు అని చెప్పారు. ప్రపంచ దేశాలు అన్ని గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఆయా దేశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడుతు న్నారని ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమం అనేది ఒక దివ్యమైన కార్యక్రమమని డైరెక్టర్ చెప్పారు.

ఒక చెట్టు జీవించినంత కాలము మానవ జాతికి కావలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ అందజేస్తోందని చెప్పారు ఈ ఆక్సిజన్ వలన మానవజాతి జీవితకాలం పెరుగుతుందని చెప్పారు. మానవజాతి యొక్క జీవన ప్రమాణం పెరుగుతుందని చెప్పారు. భారతదేశంలోని ఏ సివిల్ సర్వీస్ అధికారి ఇప్పటివరకు సాధించని ఘనతను సాధించిన వారిగా చరిత్ర పుటల్లోకి ఎక్కువ ఉన్నారని జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు కావలసిన ఏర్పాట్లు చేసినందుకు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణకు డైరెక్టర్ బలరాం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని సంఘం జనరల్ సెక్రటరీ మిర్యాల రాజి రెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, SO to డైరెక్టర్ రమేష్ రావు,కేంద్ర చర్చల కమిటీ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, 6 మెన్ కమిటీ సభ్యులు అన్నయ్య, పెట్టం లక్ష్మణ్, కుమార స్వామి, DGM Civil శివరావు,DGM ఫారెస్ట్ అమరేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా అన్ని విభాగాల అధిపతులు మరియు హైదరాబాద్ నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కిషోర్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.