హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇక నిమజ్జనం సందర్భంగా రేపు మెట్రో టైమింగ్స్ పొడిగించాచు. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది హైదరాబాద్ మెట్రో.
ఇక నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలో విద్యాసంస్థలు, అన్ని ఆఫీస్‌లకు సెలవులు ప్రకటించారు. ఇక సెప్టెంబర్ 6… ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
నిమజ్జనం రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ నుంచి పాట్నీ–ప్యారడైజ్–రాణిగంజ్–కర్బలామైదాన్–ట్యాంక్‌బండ్ మార్గం అలాగే బాలాపూర్ నుంచి చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ ప్రధాన శోభాయాత్ర జరగనుంది.
ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో పార్కింగ్ చేసుకోవచ్చని పోలీసులు వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం లేదు.
Also Read;బీఆర్‌ఎస్‌కు కేసీఆరే సుప్రీం:హరీష్

