బీఆర్‌ఎస్‌కు కేసీఆరే సుప్రీం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరి విషయంలో అయినా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. లండన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్…కలిసిగట్టుగా పనిచేయడం.. ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు.
ఎన్నారై సెల్ చైర్మన్ అనిల్ కుర్మాచలం లేని లోటు కనిపిస్తోందని.. 2012-13 లో తాను మొదటిసారి వచ్చినప్పుడు అనిల్ మొదటి ఎన్ఆర్ఐ మీటింగ్ తనతోనే ఇక్కడ ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్‌లోనేనని.. యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందిందని అన్నారు.
మల్లన్న సాగర్ నుండి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. రూ. 7000 కోట్లతో టెండర్లు కూడా పిలిచాడు…మరి కాళేశ్వరం కూలిపోతే.. ఈ టెండర్లను ఎందుకు పిలిచావ్? కాళేశ్వరం నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.
గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. అక్కడికి నీళ్ళు వచ్చేది కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా..ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండింది అని అంటున్నాడు, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక చెక్ డ్యాం కట్టారా? ఒక ప్రాజెక్టు కట్టారా? ఒక ఎకరానికి అయినా నీళ్ళు ఇచ్చారా? మరి అంత ఎలా పంట సాధ్యమైంది? అన్నారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కృషి వల్ల ఇంత పంట పండింది అనేమాట నిజం…కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు.
Also Read:జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

