ఆ రెండు చిత్రాల పరిస్థితేంటి?

47
- Advertisement -

ఈ రోజు తెలుగు బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు పోటీ పడ్డాయి. మరి ఆ సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం రండి. గ్లోబర్ వార్మింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌ గా తెరకెక్కిన ఈ మూవీలో వరుణ్ తేజ్ నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు కథ చెప్పిన విధానం పర్వాలేదు. సాక్షి వైద్య, నాసర్, వినయ్ సహా సహాయక నటీనటులు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైట్ కొరియోగ్రఫీని బాగా ఎగ్జిక్యూట్ చేయడం సినిమాకు హైలైట్‌. కాకపోతే సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఎఫెక్టివ్ గా లేదు. ఓవరాల్‌గా సినిమా అంతంత మాత్రంగానే ఉంది.

ఇక మరో సినిమా విషయానికి వస్తే.. కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బెదురులంక-2012’ ఇవాళ రిలీజైంది. ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్ధి పొందుతున్నారని, అలాంటివి పట్టించుకోవద్దన్నదే ఈ చిత్రం సందేశం. ఫస్టాఫ్‌ మొత్తం స్లోగా సాగుతుంది. సెకండాఫ్ పర్వాలేదు. కామెడీ సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు. దీనిని తోడు నిర్మాణ విలువలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు.

Also Read:టీడీపీకి ఆ ఛాన్స్ ఉందా?

కాబట్టి ఈ రెండు సినిమాల కోసం థియేటర్స్ కి వెళ్లి మరీ సినిమా చూడటం వృథా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీలో చూడొచ్చు అని ఈ సినిమాలు చూసిన వారు చెబుతున్నారు. ఇప్పటికే గాండీవ‌ధారి అర్జున‌ సినిమా ఓటీటీ పార్ట‌న‌ర్‌ను ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను మంచి ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి..!

- Advertisement -