కామారెడ్డి అభివృద్ధి పనులకు రూ.16.60 కోట్లు మంజూరు

215
gampa
- Advertisement -

కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 16.60 కోట్లు మంజూరైనట్లు తెలిపారు స్ధానిక ఎమ్మెల్యే గంపా గోవర్దన్. కామారెడ్డి నియోజకవర్గంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుండ టంతో రహదారుల అభివృద్ధికి, మరమ్మత్తులకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసిందన్నారు.

కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారి మరమ్మతుల కోసం రూ.కోటి, భవానిపెట్ నుంచి కేకేవై రోడ్డు గజసింగవరం వయ ఏళ్ళంపెట్ రోడ్డు మరమత్తుకు రూ.2 కోట్లు, భీక్కనూర్ నుంచి రాజంపేట వయా తిప్పపూర్, తలమడ్ల బీటీ రోడ్డు మరమత్తులకు రూ.83 లక్షలు, కేకేవై రోడ్డు భావానిపెట్ నుంచి గజశింగవరం రోడ్డు ప్యాచ్ పనులకు రూ.5 లక్షలు, పాల్వంచ మర్రి నుంచి భిక్కనూర్ 7 నంబర్‌ జాతీయరహదారి వయా మందపూర్ రోడ్డు మరమ్మత్తులకు రూ.4 లక్షలు, ఎన్‌హెచ్‌ 7 నుంచి రాజంపేట మెదక్ జిల్లా సరిహద్దు వరకు బీటీ మరమ్మతు కోసం రూ.1.60 కోట్లు మంజూరైనట్టు ఆయన తెలిపారు.

భిక్కనూర్ పట్టణంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.4 కోట్లు, కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయం నుంచి రైల్వే బ్రిడ్జి వరకు నాలుగు వరుసల రహదారి, డివైడర్ నిర్మాణం కోసం రూ.4 కోట్లు, దోమకొండ మండలం ముత్యంపెట్ రోడ్డును రెండు వరుసల రోడ్డుగా అభివృద్ధిచేయడానికి రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు.

- Advertisement -