యుఎస్‌లో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్

2
- Advertisement -

సంచలనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా ‘గేమ్ చేంజర్’ మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమా చేయ‌ని అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నుంది. డిసెంబ‌ర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జ‌ర‌గ‌నుంది. క‌ర్టిస్ క‌ల్‌వెల్ సెంట‌ర్‌, 4999 నామ‌న్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముంద‌స్తువేడుకి వేదిక కానుండ‌టం విశేషం. చిత్ర యూనిట్‌తో పాటు ప్ర‌ముఖులంద‌రూ ఈ వేడుక‌కి హాజ‌రుకాబోతున్నారు. సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్న క్ర‌మంలో ఛరిష్మా డ్రీమ్స్‌ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో ఇంత భారీగా జ‌ర‌గనున్న వేడుక అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఎంత‌గానో పెంచుతోంది. ఛరిష్మా డ్రీమ్స్‌పై ప్రొడ్యూస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఇండ‌స్ట్రీ, యు.ఎస్ డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిట‌ర్ స‌ర్కిల్‌లో, ఎంట్ర‌ప్రెన్యూర‌ర్‌గా బిజినెస్ స‌ర్కిల్‌లో గుర్తింపు సంపాదించుకున్న‌ రాజేష్,.. యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు..జ‌ర‌గ‌బోదు అనేంత‌ భారీ స్థాయిలో గేమ్ చేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. రామ్ చ‌ర‌ణ్‌పై అభిమానంతో రాజేష్ క‌ల్లెప‌ల్లి ఇంత పెద్ద ఈవెంట్‌ను చేయ‌నుండ‌టం అనేది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సంద‌ర్భంగా ఛ‌రిష్మా డ్రీమ్స్ ప్రొడ్యూస‌ర్‌, యు.ఎస్ ఎగ్జిబిట‌ర్ రాజేష్ క‌ల్లెప‌ల్లి మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు యు.ఎస్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌లేదు. తొలిసారి గేమ్ చేంజ‌ర్ సినిమా కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో చేయ‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈవెంట్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా చేయ‌టానికి ఇప్ప‌టి నుంచే ప్లానింగ్ చేస్తున్నాం. ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో రామ్ చ‌ర‌ణ్‌గారు, నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్, శంక‌ర్‌గారు అండ్ టీమ్‌కు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ‘జ‌ర‌గండి జ‌రగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ‘గేమ్ చేంజర్’ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు.

Also Read:‘పుష్ప 2’ ట్రైలర్‌ మరో రికార్డు..!

- Advertisement -