కాంగ్రెస్‌లో చేరిన ఉద్యోగ సంఘాల నాయకులు..

110
congress
- Advertisement -

హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఉపాధ్యాయ సంఘం నాయకులు గాల్ రెడ్డి హర్షవర్ధన్. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన హర్షవర్థన్ రెడ్డి…కాంగ్రెస్ లో మళ్ళీ చేరుతున్నందుకు అదృష్టం గా భావిస్తున్న..
2017 లో ఉపాధ్యాయ ఎమ్మల్సి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా రేవంత్ అభిమానినని తెలిపిన హర్షవర్థన్..మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నాకు అక్కడ గెలుస్తా అనే నమ్మకం తో ఇండిపెండెంట్ గా పోటీ చేశానని తెలిపారు.

గెలిచిన ఓడిన కాంగ్రెస్ లోకి వస్తా అని చెప్పా..6 నెలల నుండి పార్టీలో చేరడానికి రేవంత్ తో పాటు ఇతరులను సంప్రదిస్తున్న అన్నారు. తప్పు చేసి ఉంటే క్షమించాలన్నారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన హర్షవర్ధన్‌ కు అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి. పట్టబద్రుల ఎన్నికల్లో ఏఐసిసి ఆదేశాల మేరకు చిన్నారెడ్డి పోటీ చేశారు..కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అవసరం ఉందన్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయులకి వ్యతిరేకంగా 317 తీసుకొచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది..బడి కి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడిస్తున్నారన్నారు.

- Advertisement -