వాహనదారులకు అలర్ట్..అతిక్రమిస్తే అంతే!

22
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులకు అలర్ట్. వాహనదారులు రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించడంలేదని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రహదారులపై ద్విచక్ర వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, హెల్మెట్ తప్పనిసరి.

ఇన్ని రోజులు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్ , కారు నడిపేవారు సీట్లు బెల్టు పెట్టుకోవాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా వారికి వెసులుబాటు కోసం కొంత టైమ్ కూడా ఇచ్చారు. ఇకపై ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.వెయ్యి జరిమానా విధించానున్నారు.

సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ.వెయ్యి, డ్రంక్ అండ్ డ్రైవ్‌ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు లైసెన్స్‌ను కూడా రద్దు చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5 వేలు జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులు అలర్ట్ కావాల్సిందే.

Also Read:కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్..

- Advertisement -