టీచర్ల కేటాయింపుల్లో శాస్త్రీయతలేదు: కొదండరాం

33
kodandaram

ఉపాధ్యాయల కేటాయింపులో శాస్త్రియత లేదు,ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకవచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కొదండరాం అన్నారు..జీవో317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు..ఈ రౌండ్ టెబుల్ సమావేశానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం,బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టీపీటీఎఫ్,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు..కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపు గందరగోళంగా మారిందన్నారు కోదండరాం.

ఉపాధ్యాయులను స్థానికంగా కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ చాలా మంది ఉపాధ్యాయులను వేరే వేరే జిల్లాలో విసిరేశారని మండిపడ్డారు317 జీవో ను రద్దు చేయాలని,ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు కొందండరాం..బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ..కేసీఆర్ ఆయనకు తోచినట్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు…జీవో 317ను సవరించాలని పోరాడుతూ బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ జైలుకు వెళ్లారన్నారు..ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ తరపున పోరాటం చేస్తామని ఆమె అన్నారు..