జూలై 26 న గల్లీ గ్యాంగ్ స్టార్స్

17
- Advertisement -

‘క్లూ’, ‘మంచి కాఫీ లాంటి కధ’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సంజయ్ శ్రీ రాజ్ (Sanjay Sree Raj)ను హీరోగా పరిచయం చేస్తూ ప్రియ శ్రీనివాస్’హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సినిమా ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ‘మే 16’ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన సంస్థ ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ మరో అడుగు ముందుకు వేస్తూ ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’ అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు ‘ఆపిల్ మ్యూజిక్’ ‘స్పోటిఫై’ ‘అమెజాన్ మ్యూజిక్’ ‘రిసో ప్లేయర్’ ‘హుంగమ’ ‘జియో సావన్’ ‘గాన’ ‘యుట్యూబ్ మ్యూజిక్’ తదితర మాధ్యమాలల్లో అందరిని అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘భోలో శంకరా’ పాటకి విశేష ఆదరణ లభించింది.

దర్శకులు ధర్మ గారు మాట్లాడుతూ ” ‘గల్లి గ్యాంగ్ స్టార్స్’ అనే సినిమాని నెల్లూరు లో షూట్ చెయ్యటం జరిగింది అని. ఈ సినిమా ఒక గల్లీ లో నివసించే అనాధలు వాళ్ళు ఎదురుకునే సంఘటనల సమూహం” అని వివరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్- డి ఐ- దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తో పాటు కధలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు ఏ ఈ కథకి కథ రచయత కూడా.

ప్రొడ్యూసర్ డా. ఆరవేటి యశోవర్ధన్ గారు మాట్లాడుతూ “ఈ సినిమా క్రైమ్ డ్రామా చుట్టూ జరుగుతుంది అని ఇందులో నాలుగు ముఖ్య పాత్రలు అనాధలు అని వాళ్ళ జీవితాలు ఎలా ఎవరి వల్ల మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అంటే సినిమా తప్పకుండా చూడాలని, మాస్ ప్రేక్షకులకి తప్పక నచ్చి తీరుతుంది” అని చెప్పుకొచ్చారు.

ప్రొడ్యూసర్, దర్శకులు ఇద్దరూ ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్న సినిమాని తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా జులై 26 న రిలీజ్ అవుతుంది అని తెలియచేశారు.

Also Read:ఇక ట్రూ కాలర్ అవసరం లేదు!

- Advertisement -