ఫిబ్రవరి 17….తెలంగాణ గాంధీ, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బర్త్ డే గిఫ్ట్‌గా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటనున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రియతమ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు గజ్వేల్ ప్రజలు.
అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ మొక్కలు నాటుతూ 66 వేల చదరపు అడుగుల వైశాల్యంలో భారీ కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించారు. ఇందులో 2600 మంది పాల్గొనడమే కాదు 2600 మొక్కలు నాటారు. గజ్వేల్‌లోని విద్యా సంస్థల భవనాల సముదాయంలో ఫిబ్రవరి 15న ఈ భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
ఇక ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి విషెస్ చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.కేటీఆర్ పిలుపులో భాగంగా లక్షలసంఖ్యలో మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.