తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లానీరు:గజేంద్రసింగ్

205
gajendra
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షె‌కావ‌త్ . రాజ్యసభలో జ‌ల‌మంత్రిత్వ‌శాఖ ప‌నితీరుపై చ‌ర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్…తెలంగాణ ప్ర‌భుత్వ తీరును అభినందించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తి ఇంటికి న‌ల్లా నీరు అందిస్తోంద‌ని వెల్లడించారు.నేను రాజ‌స్థాన్‌కు చెందిన వ్య‌క్తి అని, నీటి స‌మ‌స్య‌లు త‌న‌కు తెలుసు అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వాతావ‌ర‌ణ మార్పులు జ‌రుగుతున్నాయ‌ని, అది మ‌న దేశంలో కూడా క‌నిపిస్తోంద‌ని, ప్ర‌తి ఇంటికి నీరు అందుతోంద‌న్నారు. గుజ‌రాత్‌లో కూడా 83 శాతం మంచినీరు అందుతోంద‌ని, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 76 శాతం మంది ప్ర‌జ‌ల‌కు తాగు నీరు అందుతోంద‌ని చెప్పారు.

- Advertisement -