గద్దలకొండ గణేశ్…ఫస్ట్‌డే వసూళ్లు

361
gaddalakonda ganesh

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్‌ నటించిన చిత్రం గద్దలకొండ గణేశ్. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20న విడుదల కాగా ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలకు ఒకరోజు ముందు టైటిల్ చేంజ్ అయినా తొలిరోజు వసూళ్లలో మాత్రం సత్తాచాటింది.

తొలిరోజు రూ. 4.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాం- 1.6 కోట్లు,సీడెడ్- 60 లక్షలు,యూఏ- 60 లక్షలు,వెస్ట్- 50 లక్షలు,ఈస్ట్- 50 లక్షలు,కృష్ణ- 30 లక్షలు,గుంటూరు- 45 లక్షలు,నెల్లూరు- 15 లక్షలు రాబట్టింది.

తొలి రోజే బొమ్మ హిట్టు అంటూ ప్రేక్షకులు,వరుణ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జిగర్తాండ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వరుణ్ తేజ్‌ సరసన పూజా హెగ్డే జంటగా నటించారు. వరుణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా కాగా హరీష్ శంకర్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. దీంతో ఇప్పట్లో బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల జోరు తగ్గేలా లేదు.