సినిమా రంగంలోకి గాలి జనార్థన్ రెడ్డి!

160
gali
- Advertisement -

మైనింగ్ కింగ్‌గా ,బళ్లారి రాజకీయాలను శాసించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దృష్టి ఇప్పుడు సినిమా రంగంపై పడింది. ఆయన కుమారుడు కిరీటిని వెండితెర ఆరంగేట్రం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు ఈ వార్త కర్ణాటకలో హల్ చల్‌ చేస్తోంది.

సాయి కొర్ర‌పాటి నిర్మాతగా వారాహి సంస్థ బ్యానర్‌పై కిరీటి హీరోగా పరిచయం కానున్నారు. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి యువ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు.ఈ నెల 4న బెంగ‌ళూరులో అట్ట‌హాసంగా ప్రారంభం కానుండగా తెలుగుతో పాటు క‌న్న‌డంలోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించున్నారు.

దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తుండగా సెంథిల్ కుమార్ కెమెరామన్‌గా ప‌నిచేయనున్నారు.

- Advertisement -