మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల ఇంట విషాదం..

257
nadella
- Advertisement -

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల‌(26) అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టుక‌తోనే ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతున్న జైన్….సోమ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. సత్యనాదెళ్ల కుమారుడి మృతిపట్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

2014లో మైక్రోసాఫ్ట్​ సీఈవోగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. తన కుమారుడు జైన్​ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను ఇతరులకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

- Advertisement -