శాండల్‌వుడ్‌పై ఐటీ పంజా

261
IT scanner on Sandalwood
- Advertisement -

కన్నడ సినీ పరిశ్రమలోని ప్రముఖులకు ఐటీ అధికారులు షాకిచ్చారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్,సీఎం కుమారస్వామి భార్య రాధిక,హీరో సుదీప్‌తో పాటు ఇండస్ట్రీలోని 10మంది సినీ దిగ్గజాలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.

బెంగళూరులోని దాదాపు 60 ప్రాంతాల్లో ఏకకాకలంలో ఐటీ సోదాలు కొసాగుతున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా ఈ దాడులు జరగడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.

  karnataka it raids

కన్నడ సినిమా ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ టాప్ హీరోగా ఉన్నారు. ఇప్పటి వరకు పునీత్ కుమార్ 27 పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో చాలా సినిమాలు సూపర్‌హిట్‌ అవగా ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.

కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్‌ను కూడా వదలని ఐటీ అధికారులు… కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ సహా శివ్ రాజ్‌కుమార్, సీఆర్ మనోహర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.

- Advertisement -