ఆగని పెట్రో వాత…నాలుగో రోజు పైపైకే

194
petrol
- Advertisement -

వరుసగా నాలుగో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 39 పైసల వరకు పెంచగా ఓవరాల్‌గా ఫిబ్రవరిలో చమురు ధరలు పెరగడం ఇది ఆరోసారి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.91.65, డీజిల్‌ రూ.85.50కి చేరగా ముంబైలో పెట్రోల్‌ రూ.94.64, చెన్నైలో రూ.90.44, బెంగళూరులో రూ.91.09, జైపూర్‌లో రూ.94.81గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 88.14కు పెరగ్గా.. డీజిల్‌ రూ.78.38కి చేరింది.

- Advertisement -