హ్యాపీ బర్త్ డే…జగ్గూ భాయ్

234
jagapathi
- Advertisement -

31 సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోగా రాణిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు జగపతిబాబు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా హీరోలతో, దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రతినాయకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న జగపతిబాబు బర్త్ డే నేడు.

ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు జగపతి బాబు. ఆయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో పాటు గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు.

1989 లో సింహస్వప్నం సినిమా ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు జగపతి బాబు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. తర్వాత జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల విజయంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్జీవీతో గాయం జగపతి బాబులోని నటుడిని మరోక స్ధాయికి తీసుకెళ్లింది.

1994 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎస్. వి. కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్ళి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. ఇదే దారిలో దాదాపు 80 చిత్రాలలో నటించారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో బాగా పేరు తెచ్చింది. ఈ సినిమాకు జగపతిబాబుకు ఉత్తమ సహాయనటుడిగా నంది పురస్కారం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహరం సినిమాకుగాను ఆయన రెండోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం విలన్‌గా తెలుగు తెరపై ప్రేక్షకులను మెప్పిస్తున్న జగపతిబాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -