స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన దగ్గరినుంచి రకరకాల ఆఫర్లతో వివిధ రకాల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అరచేతిలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా..గుండుసూది దగ్గరి నుంచి ఖరీదైన కార్ల వరకు అన్నిరకాల వివరాలు,అమ్మకాలు,కోనుగోళ్లు ఆన్ లైన్‌లోనే జరుగుతున్నాయి. దీంతో విమానాశ్రయాలు,బస్టాండ్,రైల్వే స్టేషన్లు,చారిత్రాక ప్రదేశాల్లో వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్రీ వైఫై అంటూ రకరకాల ఆఫర్లు దర్శనమిస్తున్నాయి. ఉచితంగా నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చని ఉచిత వైఫై సేవలకు సిటీజనుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది.
ఇక ముఖ్యంగా భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం ఉచితంగా అందిస్తున్న వైఫై సేవల ఉపయోగంలో బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ఫ్రీ వైఫై సేవలను ప్రయాణికులు ఎందుకోసం వినియోగించుకుంటున్నారో తెలిస్తే అవాక్కవకమానరు. గత నెల నుంచి అందుబాటులోకి వచ్చిన వైఫై సేవలను ఎక్కువమంది ప్రయాణికులు పోర్న్ సైట్‌లు చూడడానికి, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికే పూర్తిగా ఉపయోగించుకుంటున్నారట. ఈ విషయంలో పట్నా స్టేషన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
పట్నా తర్వాత ఇంటర్నెట్‌ను సెర్చ్ చేస్తున్న స్టేషన్లలో జైపూర్ రెండోస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, న్యూఢిల్లీ నిలిచాయి. యూజర్ల డాటాను విశ్లేషించగా ఈ విషయం వెల్లడైనట్టు అధికారి తెలిపారు.అతి తక్కువ మంది మాత్రం యాప్స్, బాలీవుడ్ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పట్నా స్టేషన్‌లో 1జీబీ వైఫై అందుబాటులో ఉంది. త్వరలో దీనిని 10 గిగాబైట్లకు పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి ఫ్రీ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేందుకు యువత గంటల తరబడి గడుపుతుండడం గమనార్హం.