- Advertisement -
గత కొంతకాలంగా టీఎస్ఆర్టీసీలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్తను అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మహత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ఉచితంగా ప్రయాణించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించింది.
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని… ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు.
ఈ ఎలక్ట్రానిక్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ ఉచిత సర్వీసులలో మొదటి ప్రాధాన్యత వృద్ధులు, వికలాంగలు, గర్భిణులు, రోగులకు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
- Advertisement -