రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త…రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. లబ్దిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 20 వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ప్రతి ఒకొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చే 5 కిలోలకు తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు కలిపి.. మొత్తం 10
కిలోల బియ్యాన్ని వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 1.20 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని అందజేస్తోంది ప్రభుత్వం.