కొర్రలు తింటే..ఎన్ని ఉపయోగాలో!

104
- Advertisement -

ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు కొర్రల గురించి పెద్దగా తెలియకపోవచ్చు మన పెద్దలకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్థాలలో కొర్రలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇప్పుడైతే వరి అన్నం తింటున్నాం గాని ఇకప్పుడు మన పెద్దలు కొర్రలతో చేసిన అన్నం ను ఎంతో ఇష్టంగా తినేవారు. కొర్రలు ఎంతో పుష్టి కలిగిన ఆహారం అని మన పెద్దలు ఇప్పటికి చెబుతూనే ఉన్నారు. కానీ నేటి జెనరేషన్ పిల్లలు కొర్రఅన్నం తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపరు. కానీ కొర్రాన్నం తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు. కాబట్టి కొర్రల యొక్క ఉపయోగాలు ఎంటనే విషయాలను తెలుసుకుందాం..!

కొర్రలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటి పోషకాలతోపాటు మాంసకృత్తులు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల కొర్రన్నం తినడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. ఇంకా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కొర్రలు మంచి పుష్టి కలిగిన ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. కొర్రన్నం ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి.

 Also Read:చంద్రబాబు దర్శకత్వంలో రేవంత్:ఎర్రోళ్ల

తద్వారా మధుమేహం నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా కొర్రన్నం తినాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఇంకా కడుపునొప్పి, ఆకలి మాంధ్యం, అతిసార వంటి వ్యాధులకు కొర్రలు దివ్యఔషధంలా పని చేస్తాయని పలు అధ్యయనలు చెబుతున్నాయి. ఇంకా కొర్రలలో ఉండే పోషకాలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక స్త్రీలలో వచ్చే ఋతుక్రమ సమస్యలను కూడా కొర్రలు దూరం చేస్తాయి. కాబట్టి తృణ దన్యాలలో అత్యధిక పోషక విలువలున్న కొర్రలను వారంలో కనీసం మూడుసార్లైన తినాలని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.

 

- Advertisement -