- Advertisement -
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా వైఎస్ జగన్ మెజార్టీ సాధించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 151సీట్లు సాధించిన జగన్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.
దివంగత నేత ఎన్టీఆర్ ఘన విజయం సాధించినప్పడు కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని కానీ జగన్ మాత్రం ఒంటరిగా 151సీట్లు సాధించి చరిత్ర సృష్టించారని చెప్పారు. నిన్న ఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతుంటే చూశానని తెలిపారు. ఆ టైంలో జగన్ లో వైఎస్ ను చూశానని చెప్పారు. మనసులోని మాటను బయటకు చెప్పేసే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని ఉండవల్లి తెలిపారు.
- Advertisement -