ధోని సాయంతోనే నెంబర్‌ 4: విజయ్‌ శంకర్‌

347
vijay shankar
- Advertisement -

ప్రపంచకప్ సమరానికి భారత్ సిద్ధమైంది. కోహ్లీ నాయకత్వంలో ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న భారత్‌ విజయమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విజయ్‌..యువ క్రికెటర్లని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో మహేంద్రసింగ్ ధోనీ ముందు వరుసలో ఉంటాడని తెలిపాడు.

మెల్‌బోర్న్ వేదికగా వన్డేల్లోకి అరంగేట్రం చేసిన తనకు అప్పటివరకు అంత పెద్ద స్టేడియం, అభిమానుల మధ్య మ్యాచ్ ఆడలేదన్నారు. బౌలింగ్‌ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లి నా చేతికి బంతిని ఇవ్వగానే ఒత్తిడికి గురయ్యానని కానీ నా వద్దకి వచ్చిన ధోనీ కూల్‌గా కాసేపు మాట్లాడి.. సరైన ప్రదేశంలో బంతిని విసరమని సూచించాడు. వాస్తవానికి అది చాలా చిన్న సలహానే. కానీ ఆ ఒత్తిడిలో ధోనీ మాటలు నాకు గొప్ప ఉపశమనం కలిగించాయన్నారు.

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. జూన్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్ కప్‌ టీం ఎంపికలో భాగంగా అంబటి రాయుడ్ని పక్కనపెట్టి మరీ సెలక్టర్లు విజయ్ శంకర్‌ని ఎంపికచేశారు.

- Advertisement -