మెడికల్‌ స్టోర్లలో లేని ఔషధాలు..మీకు తెలుసా?

167
- Advertisement -

కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రజల జీవన విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. గతంలో చిన్న చిన్న రోగాలకు కూడా డాక్టర్ దగ్గరికి పరుగెత్తే వారు. అయితే కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది. అనారోగ్యం బారిన పడితే పెద్దదైతే డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కానీ చిన్నదైతే తమకు ఉన్న అవగాహనతో మెడికల్ షాపులకు వెళ్లి ట్యాబ్లెట్స్ వేసుకుని రోగాలను తగ్గించుకుంటున్నారు. మరికొంతమందైతే మెడికల్ షాపులకు వెళ్లకుండానే జబ్బులను తగ్గించుకుంటున్నారు.

బాధలు, ఆలోచనలు, ఆందోళనలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ చెయ్యాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి డబ్బుతో కూడుకున్న పనులు కూడా కాదు. ఇక వాటిని అనుసరిస్తే కచ్చితంగా మెడికల్ షాపులకు వెళ్లకుండానే ఆరోగ్యం మీ సొంతం అయ్యి తీరుతుంది.

తొలి ఔషధం వ్యాయామం.. ఉదయం/సాయంత్రం నడకతో మంచి ప్రయోజనాలుంటాయి. ఇక ఉపవాసం చేయడం, కుటుంబంతో కలిసి భోజనం చేయడం,నవ్వు కూడా ఔషధంగా మారింది. గాఢ నిద్ర పోవడం, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం, మనసు ప్రశాంతత, ప్రార్ధన,ఆధ్యాత్మికత, నిశ్శబ్దంగా ఉండటం చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.

వీటితో పాటు మనశ్శాంతి, ఇతరులతో ప్రేమగా ఉండటం చేస్తే ప్రతి మంచి స్నేహితుడు ఒక ఖచ్చితమైన మెడికల్ స్టోరే. ఇవన్నీ ఉచితంగా లభించేవే కాబట్టి వీటిని పాటిస్తూ ఆనందంగా ఉండండి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -