Lungs:ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే!

843
Foods for keeping your lungs healthy
- Advertisement -

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. ఫ్రూట్స్‌ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇంకా శ్వాస సమస్యల చికిత్సకు ఎంతగానో సహకరిస్తాయి. ప్రస్తుతం ఎక్క‌డ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది. వాహ‌నాల నుంచి వెలువడే పొగ‌, ప‌రిశ్ర‌మ‌లు, అడ‌వుల‌ను ధ్వంసం చేయడం త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ‌వుతున్న‌ది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. క‌నుక ఎవ‌రైనా ఊపిరితిత్తుల‌ను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దీని కోసం కొన్ని రకాల పండ్లను తీసుకుంటే మనకు ఎంతో మేలు.

Foods for keeping your lungs healthy

1. ద్రాక్ష పండ్లు:వారంలో క‌నీసం నాలుగు సార్లు ద్రాక్ష పండ్ల‌ను తీసుకోవాలి. వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేస్తాయి. శ్వాస కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.

2. ఉల్లిపాయ‌లు: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తాయి. ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేస్తాయి.

3. క్యారెట్ జ్యూస్: ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 300 ఎంఎల్ మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగితే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. వాటిల్లో ఉండే చెడు ప‌దార్థాలు తొల‌గిపోతాయి.

4. అల్లం: అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక‌టి నుంచి రెండు టీస్పూన్ల అల్లం ర‌సం సేవిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

Foods for keeping your lungs healthy

5. పుదీనా టీ: రోజూ ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం పుదీనా టీ తాగాలి. ఇది శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసే గుణాలు పుదీనా టీలో ఉంటాయి.

6. పైనాపిల్ జ్యూస్: రోజూ 300 ఎంఎల్ మోతాదులో పైనాపిల్ జ్యూస్‌ను తాగినా చాలు. ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

7. నిమ్మ‌ర‌సం: రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి.

8. ఆరెంజ్‌: ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో సి విటమిన్ .. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.

Also Read:గుంటూరు కారం..మరో రికార్డు

- Advertisement -