ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

3
- Advertisement -

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్, గురుకులాలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్పటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ / వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసింది.

కమిటీ సభ్యులు తిన్నాకే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని ఆదేశించింది. ప్రతీ రోజు వంట చేసే ముందు స్టోర్ రూమ్, కిచెన్ ఫోటోలు తీసి పరిశీలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.

వ‌స‌తిగృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు.

Also Read:Priyanka Gandhi: ప్రియాంక గాంధీ అనే నేను 

- Advertisement -