చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు. తెలంగాణలో ముఖ్యమైన పిండి వంటలు,రుచికరమైన భోజన ఏర్పాట్లు, పండ్లు, ఫలాలు, తాంబూలం భోజన సమయంలో కవులకు విదేశీ వారికి, కళాకారులకు,సిబ్బందికి,మీడియా వాళ్ళకు, అధికారులకు అందరికి ఒకే రీతిలో అద్భుతంగా వడ్డించారు. ఇంతటి మహత్కార్యం నిర్వహించిన ఘనత చరిత్రలో మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌కే సాధ్యమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భోజనం ఏర్పాట్లు చేయడంపై మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది. ఎల్బీస్టేడియంలోని పాల్కూరికి సోమనాథుని ప్రాంగణం బమ్మెర పోతన వేదిక మీద ముగింపు వేడుకలు జరిగాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. తెలుగు మహాసభ ప్రారంభ వేడుకలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన విషయం విదితమే. ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా అనేక కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భాషాభిమానులను అలరించాయి. నగరంలో ఎక్కడా చూసినా ఈ ఐదు రోజుల పాటు తెలుగు పండుగ వాతావరణం కొనసాగింది.