బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కేజ్రీవాల్ కసరత్తు!

23
kejriwal
- Advertisement -

ఢిల్లీలో ఆప్ సర్కార్‌ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నించిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరగా 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు 800 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని కేజ్రీవాల్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష ఎదుర్కోనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో చేపట్టిన ఆపరేషన్ లోటస్ ఫెయిలై ఆపరేషన్ కీచడ్ (మట్టి) అయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వద్ద చాలా డబ్బు ఉంటుందని, అయితే ప్రజల అవసరాలు తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా ఉండదని, తాము ప్రజల అవసరాలు తీరుస్తుంటే రేవ్డీ అంటూ హేళన చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు.

దేశంలో ఇప్పటివరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు మొత్తంగా 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

- Advertisement -