అవిసె గింజలతో లాభాలు!

44
- Advertisement -

అవిసె గింజలు చూడడానికి బ్రౌన్ కలర్ లో గోదుమ గింజ సైజులో ఉంటాయి. వీటిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. వీటిని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అవిసె గింజలలో వివిధ రోగాలను నయం చేసే యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందుకే ఆయుర్వేద ఔషధల తయారీలో వీటిని వాడతారు. అయితే అవిసే గింజలను పొడిగా చేసుకొని లేదా నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ బి6, బి12, ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్, ఇంకా మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ ఇలా అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయట. .

ముఖ్యంగా మలబద్దకంతో బాధపడే వారు క్రమం తప్పకుండా ఆవిసె గింజలను తింటే ఆ సమస్య దూరమౌతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయట. ఇందులో ఉండే లిగ్నాంస్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయట. అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో సహాయ పడుతుంది. తద్వారా గుండె జబ్బులు దరిచేరవు. ఇంకా శరీరంలోని క్యాన్సర్ కరకాలను దూరం చేయడంలో అవిసే గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ఉపయోగ పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా వీటిని ప్రతిరోజూ తినడం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు రోగ నిరోదక శక్తి కూడా పెరుగుతుందట. కాబట్టి ప్రతిరోజూ ఒక గుప్పెడు అవిసె గింజలను తినడం అలవాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

Also Read:కౌశిక్ రెడ్డి..బ్లాక్ బుక్!

- Advertisement -