బెంగాల్‌లో బీజేపీ..కేరళంలో యూడీఎఫ్

10
- Advertisement -

ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో ప్రారంభ ట్రెండ్స్ ఊహించని విధంగా మారుతున్నాయి.

బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ప్రారంభ ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (148) దాటి దూసుకుపోతోంది.

భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకంజలో ఉండగా, బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.తమిళనాడులో ఈసారి ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అధికార DMK కూటమికి గట్టి పోటీ ఇస్తూ, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) అనూహ్యంగా పుంజుకుంది.

దాదాపు రెండు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే, విజయ్ పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి DMK ముందంజలో ఉన్నప్పటికీ, TVK ఓట్లను భారీగా చీల్చడం గమనార్హం.కేరళలో LDF వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని చూస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) గట్టి పోటీనిస్తోంది.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియాలో ‘సీఎం’ హోదాను తొలగించడం, ఇక్కడ అధికార మార్పు జరగవచ్చనే సంకేతాలను ఇస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి.

అస్సాం: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇక్కడ హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు.

Also Read:‘జెట్లీ’..ఎంజాయ్ చేస్తున్నారు!

పుదుచ్చేరి: ఇక్కడ కూడా ఎన్డీఏ (AINRC-BJP) కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ అధికారాన్ని నిలబెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -