బెంగాల్, కేరళంలో అనూహ్య పరిణామాలు

6
- Advertisement -

కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్‌కు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న వేళ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

కేరళం సీఎం పినరయి విజయన్ మరియు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా ఖాతా (X – గతంలో ట్విట్టర్) బయోలో అనూహ్య మార్పులు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఆయన ఖాతాలో ‘Chief Minister of Kerala’ అని ఉన్న డిజిగ్నేషన్‌ను తొలగించి, దాని స్థానంలో కేవలం ‘Polit Bureau Member, Communist Party of India (Marxist)’ అని మార్చారు.

ఫలితాలు రాకముందే ఆయన తన హోదాను తొలగించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఈసారి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలడంతో, విజయన్ ముందే ఓటమిని అంగీకరించారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఇది కేవలం ఎన్నికల నియమావళి లేదా వ్యక్తిగత నిర్ణయం కావచ్చని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితాల వెల్లడికి ముందే మమతా బెనర్జీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యాన్ని చూపిస్తుండగా, మరికొన్ని TMC వైపు మొగ్గు చూపాయి. లక ఫలితాలకు కొన్ని గంటల ముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.ఉత్కంఠలో రెండు రాష్ట్రాలుకేరళలో వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని విజయన్ భావిస్తుండగా, బెంగాల్‌లో తన పట్టు నిలుపుకోవాలని మమతా ప్రయత్నిస్తున్నారు. అయితే కౌంటింగ్ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రులు తీసుకున్న ఈ ‘ముందస్తు’ చర్యలు వారు ఓటమిని పసిగట్టారా? లేక ఇది కేవలం వ్యూహాత్మక మార్పా? అనేది ఈరోజు సాయంత్రానికి తేలిపోనుంది.

Also Read:‘జెట్లీ’..ఎంజాయ్ చేస్తున్నారు!

- Advertisement -