చిట్టిబాబు నటనకు వందనం…

325
Five reasons for watch Ram Charan Rangasthalam
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను దృశ్యకావ్యంలా మలిచాడు సుకుమార్. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్తగా 1985 నాటి కాలాన్ని తలపిస్తూ సుకుమార్ తీస్తున్న ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

పక్కా పల్లెటూరి యాసలో పూర్తిస్థాయి ఊర మాస్ సినిమాగా వచ్చిన రంగస్ధలంలో రామ్ చరణ్ నటన చిరుని తలపించిందట. ముఖ్యంగా చిట్టిబాబుగా చెర్రీ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచిందట. సినిమా చూసిన వారంతా సినిమా అంతా చిట్టిబాబే అంటున్నారు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన అద్భుతం అని తెగ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా చెవిటివాడి పాత్రతో హాస్యాన్ని అద్భుతంగా పండించాడట.

rangasthalam

సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ నటన అద్భుతమని ట్వీట్ చేస్తున్నారు. సినిమా మొత్తాన్ని చరణ్ తన భుజస్కందాలపై నడిపించాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. చరణ్ నటనను చూసి ఆయనకు వందనం అని ట్వీట్ చేస్తున్నారు.ఫస్టాఫ్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. అక్కడక్కడ కొన్ని మైనస్‌లు ఉన్నా రామ్ చరణ్ నటన ముందు ఇవేమీ కనబడవట. మొత్తంగా ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో రంగస్ధలం టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

- Advertisement -