- Advertisement -
నోవెల్ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ తయారీలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే రష్యా తొలి వ్యాక్సిన్ రిలీజ్ చేయగా చైనా వ్యాక్సిన్ ట్రయల్స్ కీలకదశలో ఉన్నాయి.
సినోవాక్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న చైనా వ్యాక్సిన్ వృద్ధులకు బాగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ తేలింది. టీకా తీసుకున్నవారిలో వృద్ధులు బెటర్‌గా ఫీలవుతున్నట్లు సినోవాక్ కంపెనీ వెల్లడించింది. తొలి, రెండవ దశ ట్రయల్స్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని గుర్తించారు.
ఇక రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ తొలి బ్యాచ్‌ను ప్రజల కోసం విడుదల చేసినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. త్వరలోనే ప్రాంతాల వారీగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమాలజీ, మైక్రోబయాలజీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ రష్యా రూపొందించినట్లు స్పష్టం చేసింది.
- Advertisement -