జయప్రకాశ్ రెడ్డి మృతిపట్ల ఎన్టీఆర్,మహేశ్ సంతాపం

127
mahesh babu

టాలీవుడు హాస్యనటుడు జయప్రకాశ్‌ రెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొనగా సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి తనని తీవ్రంగా కలిచివేసిందని… టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని అత్యుత్త‌మ న‌టుడు, క‌మెడీయ‌న్స్‌లో ఆయ‌న ఒక‌రని కొనియాడారు. అతనితో ప‌నిచేయ‌డం ఎల్ల‌ప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. అత‌ని కుటుంబానికి, అభిమానుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని పేర్కొన్నారు.

నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను అంటూ ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.