అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విలెలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఓ వీడియో గేమ్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా అక్కడున్న జనంపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన నిందితుడు సహా మొత్తం ముగ్గురు మృతి చెందగా..మరో 13 మంది గాయపడ్డారు. అందులో 11 మందికి బుల్లెట్ గాయాలు కాగా..మరో ఇద్దరికి ఇతర గాయాలైనట్టు స్థానిక పోలీస్ అధికారులు ట్వీట్ ద్వారా తెలిపారు.
24 ఏళ్ల శ్వేత జాతీయుడు బాల్టిమోర్‌కు చెందిన డేవిడ్ కట్జ్ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని, ఇంకా దీనిని ధృవీకరించాల్సి ఉందని, బాల్టిమోర్ పోలీసులకు ఎఫ్‌బీఐ విచారణలో సహకరిస్తున్నది అని పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఫ్లోరిడాలో ఇలాంటిదే కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూల్‌పై సాయుధుడు దాడి చేయడంతో ఏకంగా 17 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
#TheLandingMassShooting – Three deceased individuals were located at the scene, one being the suspect.
13 victims
-11 with gunshot wounds
-2 with other injuries
1 suspect deceased https://t.co/qBJvkaO7xT— Jax Sheriff's Office (@JSOPIO) August 27, 2018
We have located and impounded the suspect’s vehicle and a search is pending. We believe he stayed somewhere locally last night. If anyone has information about where he stayed, please contact 904-630-0500 or JSOCrimeTips@Jaxsheriff.org https://t.co/qBJvkaO7xT
— Jax Sheriff's Office (@JSOPIO) August 27, 2018