కేరళకు సల్లూభాయ్‌ రూ.12కోట్లు..?

177

భారీ వర్షాలతో, వరదలతో అతలాకుతం అయిన కేరళ రాష్ట్రాన్ని ఎంతో మంది ప్రముఖులు భారీగా విరాళాలిచ్చి ఆదుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా కేరళకు రూ.12 కోట్లు విరాళంగా ఇచ్చాడని టాక్. ఈ విషయాన్ని నటుడు జావెద్‌ జాఫ్రీయే ట్వీట్ చేయడంతో చాలా మంది నిజమే అని నమ్మారు.

 Salman Khan

ఇక ఆ విషయం గురించి ట్వీట్‌ చేసిన జావెద్‌ ను సోషల్‌ మీడియాల కొందరు ట్రోల్‌ చెయ్యడం స్టార్ట్‌ చేశారు. దాంతో తాను చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు జావిద్‌. సల్మాన్ 12 కోట్లు ఇచ్చాడని తాను ఎక్కడో విన్నానని, అయితే ఆ విషయం ధృవీకరించుకోవాల్సి ఉందని మరో ట్వీట్ చేశాడు. అయితే దీనిపై ఇప్పటివరకు సల్మాన్‌ఖాన్ మాత్రం స్పందించలేదు.