భారీ అగ్నిప్రమాదం.. 36 మంది సజీవ దహనం

242
china
- Advertisement -

చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెనాన్స్‌ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరుగగా ఇందులో 36 మంది సజీవ దహనం అయ్యారు. ఓ కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగగా ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఏడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని..మరో ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -