సరోగసితో సినిమాలు ఇవే..

191
- Advertisement -

ప్రతి తల్లిదండ్రులకు పిల్లలను కనడం పెంచడం పెద్ద బాధ్యత. మరీ పిల్లలు పుట్టకపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు?ఏలా పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటారు? కానీ ఆధునిక కాలంలో సరోగసి ద్వారా పిల్లలను కనడం అలావాటు అయింది. ఆకోవలోకే చెందిన సినిమాలు వస్తే ఏలా ఉంటుంది. సమాజంపై ఎటువంటి ప్రభావం పడనుంది. ఈ మధ్యకాలంలో కేంద్రప్రభుత్వం సరోగసి మీద ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది.

ఎలాంటి పరిస్థితుల్లో సరోగసి ద్వారా పిలలను పొందడం లాంటి ఆంశాలను పొందుపరిచింది. ఇలాంటి సరోగసి మీద మన డైరెక్టర్‌లు జమానా నుంచి సినిమాలు తీస్తున్నారు. తెలుగులోనే కాదు హిందీ మరాఠీ సినిమాల నుంచి సరోగసి అంశం మీద సినిమాలు వచ్చాయి. మరీ అవెంటో ఓసారి లుక్కేద్దాం రండి..

నిన్ననే విడుదలైన యశోద సినిమా సమంత ప్రధాన పాత్రలో వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సమంతతో పాటు ఉన్ని ముకుందన్ వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంసారం – సంతానం
1981లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అద్దెగర్భం కాన్సెప్ట్‌తో వచ్చింది. శోభన్ బాబు జయసుధ సీమ కలిసి నటించిన ఈ చిత్రంను తమిళ రచయిత శివశంకరి రాసిన ఒరు సింగం ముయలాగిరతు అనే నవల ఆధారంగా వి.మధుసూదనరావు అద్భుతంగా తెరకెక్కించాడు.

జాబిలమ్మ పెళ్లి
1996లో విడుదలైన ఈ సినిమా అద్దెగర్భం కాన్సెప్ట్ తో వచ్చింది. జగపతిబాబు రుచిత ప్రసాద్ మహేశ్వరీ ప్రధానపాత్రలో నటించారు.

9నెలలు
2001లో వచ్చిన ఈ సినిమా కేవలం 15రోజుల్లో తీశాడు. హీరో విక్రమ్ సౌందర్య నటించిన ఈ సినిమా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించాడు.

దూస్రీ దుల్హన్
1983లో వచ్చినే దూస్రీ దుల్హన్ సినిమా అద్దెగర్భం బేస్‌తో నిర్మించారు. ఇందులో షబానా అజ్మీ షర్మిలా ఠాగూర్ విక్టర్ బెనర్జీ నటించిన ఈ సినిమాను లేఖ్ టాండన్ దర్శకత్వం వహించారు. బప్పిలహిరి స్వరాలు సమకుర్చారు.

ఫిలాల్
టబు సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో పోషించిన ఫిలాల్ సినిమా 2002లో వచ్చింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సరోగసి ఆధారంగా వచ్చిన సినిమా.

చోరి చోరి చుప్కే చుప్కే
2001లో విడుదలైన ఈసినిమా సల్మాన్‌ఖాన్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇందులో సల్మాన్‌ రాణి ముఖర్జీ ప్రీతి జింటా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమను అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించారు.

మిమీ
లక్ష్మణ్ ఉతేకర్ దర్వకత్వం వహించిన మిమీ సినిమా 2021లో విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. కృతిసనన్ పంకజ్ త్రిపాఠి కలిసి నటించిన ఈసినిమా సరోగసి ఆధారంగా చేసుకొని తీశారు. ఈ సినిమాలో విదేశి జంటకు సరోగేట్‌గా చేసింది కృతి సనన్.

వీటితో పాటుగా వెలకమ్‌ ఒబామా, దసరతనమ్‌, ఐ ఆమ్‌ వంటి సినిమాలు సరోగసి నేపథ్యంలో తెరకెక్కాయి. కాగా వెల్‌కమ్‌ ఒబామా, మిమీ సినిమాలు మాలా ఆయ్‌ వ్హయ్చా అనే మరాఠా సినిమాకు రీమేక్‌గా తెరకెక్కాయి. ఈ మరాఠా చిత్రానికి బెస్ట్‌ ఫిలిం కేటగిరిలో నేషనల్‌ అవార్డు వచ్చింది.

ఇవి కూడా చదవండి..

యశోద ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

తల్లైన బిపాషా బసు!

కంగనా… ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌ వంతు

- Advertisement -