ఫిఫా 2018 ప్రపంచకప్ హోరాహోరిగా సాగింది. రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ విజయకేతనం ఎగురవేసింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ కప్ ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ లో క్రొయేషియాపై విజయం సాధించింది. గత కొద్ది రోజులుగా పోటాపోటీగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకోవడంతో ఆనందలో మునిగిపోతున్నారు ఫ్రాన్స్ ఆటగాళ్లు. మూకుమ్మడిగా ఫ్రాన్స్ ఆటగాళ్లంతా క్రోయేషియాపై దాడి చేశారు. దింతో క్రోయేషియా ప్లేయర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు.
రెండు దశాబ్దాలుగా ఫిఫా కప్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు తమ అద్భుతమైన ఆటతో భారీ వర్షంలోనే కప్ తీసుకుని సంబరాలు చేసుకున్నారు. ఇప్పటివరకూ మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్ రెండు సార్లు టైటిల్ ను దక్కించుకుంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, పెరూలపై ఫ్రాన్స్ గెలుపొంది ఫైనల్ కు చేరింది. నాకౌట్ మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ల జట్లయిన అర్జెంటీనా, ఉరుగ్వే జట్లను ఫ్రాన్స్ ఓడించింది. ఇక ఫ్రీక్వార్టర్స్ లో అర్జెంటీనాపై ఫ్రాన్స్ గెలవగా, క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేపై గెలిచింది. ఫ్రాన్స్ జట్టు కీపర్ హూగోలోరిస్ తన అద్భుతమైన ఆటతీరుతో గోల్స్ కాకుండా అడ్డుకున్నాడు.
టోర్ని ప్రారంభంనుంచి ఫ్రాన్స్ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును కనబర్చారు. ఇక ఫ్రాన్స్ టీం కోచ్ అయినటువంటి డిడియర్ డెస్ చాంప్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గతంలో కెప్టెన్ కోచ్ గా డెన్ చాంప్స్ వరల్డ్ కప్ అందుకున్నాడు. 1998లో బ్రెజిల్ పై గెలిచి ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించగా..2006 ఫైనల్ మ్యాచ్లో ఇటలీ చేతిలో ఓటమి పాలయ్యింది. మొత్తానికి 2018 ఫిఫా వరల్డ్ కప్ ను ఫ్రాన్స్ సొంతం చేసకుంది.