గోల్డెన్ బూట్ కోసం పోటీ…

10067
- Advertisement -

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అభిమానులు బెట్‌ కట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే మా ఫెవరేట్ టీం గెలుస్తోందని… మా ఫెవరేట్ టీం గోల్డెన్ బూట్‌ సాధిస్తోందని భారీ మొత్తంలో పందెం కాస్తున్నారు. ఈ సందర్భంగా మొదటి సెమీస్ డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభంకానున్నాయి. టోర్నీ మొత్తం ఫెవరేట్ జట్లుగా ఆర్జేంటినా, పోర్చుగల్‌, బ్రిటన్, ఫ్రాన్స్, క్రోయేషియా, అమెరికా జట్లుగా ఉన్నాయి. కానీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకునే నాటికి అంచనాలు భారీ మార్పులకు గురైంది. దీంతో సెమీస్‌లో క్రోయేషియా ఆర్జేంటినా మొరాక్‌ ఫ్రాన్స్ లు నిలిచాయి.

2022వ ప్రపంచకప్‌ గోల్డెన్ బూట్ అవార్డు కోసం ఒకరికొకరు గట్టి పోటీనిస్తున్నారు. తాజాగా ఈ రేసులో 3ఆటగాళ్లు ఉన్నారు. గోల్డెన్ బూట్ అవార్డు కోసం అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ, ఫ్రాన్స్‌కు చెందిన ఒలివర్ గిరౌడ్, కైలియన్ ఎంబాప్పేకి గట్టి పోటీనిస్తున్నారు. ఎంబాప్పే ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధికంగా 5 గోల్స్ చేశాడు. మెస్సీ అర్జెంటీనా తరపున నాలుగు గోల్స్ చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఒలివర్ గిరౌడ్ కూడా టోర్నీలో నాలుగు గోల్స్ చేశాడు. మరీ వేచి చూడాలి ఎవరికి ఈ గోల్డెన్ బూట్‌.

ఇవి కూడా చదవండి…

మీ ఆట అనితర సాధ్యం:కోహ్లీ

ఎన్టీఆర్‌ 30 కొత్త ఆప్‌డేట్‌

వెంకీని పార్టీ అడిగిన చిరు

- Advertisement -