రోలెక్స్ పై లోకేశ్‌ క్లారిటీ…

294
- Advertisement -

సినిమాటిక్ యూనివర్స్‌లో వరుసగా సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న లోకేశ్ కనగరాజ్…తాజాగా మరో కీలకమైన ప్రకటన చేశారు. విక్రమ్ సినిమాలో కీలకపాత్ర పోషించిన స్టార్ హీరోతో సినిమా వస్తుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ పాత్రలో వర్సటైల్ యాక్టర్ సూర్య తనదైన శైలి మార్క్‌ విధ్వంసకరమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దీంతో మళ్లీ రోలెక్స్ పాత్రను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య పై ఓ సినిమా తెరకెక్కించే ప్రణాళికలు రచిస్తున్నట్టు టాక్.

ప్రస్తుతం లోకేశ్‌ ఖైదీ2 థళపతి67 విక్రమ్‌2 సినిమాలు తెరకెక్కించే ప్లాన్లో ఉన్న లోకేశ్‌ త్వరలో మరో సినిమాను తీయబోతున్నారు. ఈ సినిమాలో రోలెక్స్ పాత్ర గురించి ఉంటుందని వార్తలు కోలీవుడ్‌లో సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పటికి పట్టాలెక్కుతుందో ఎప్పుడు ఈ సినిమాను థియేటర్లో చూస్తామో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే విషయంపై లోకేశ్‌ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి…

వెంకీని పార్టీ అడిగిన చిరు

ఎన్టీఆర్‌ 30 కొత్త ఆప్‌డేట్‌

అవ‌తార్‌-2 దర్శకుడికి కరోనా

- Advertisement -