హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమ జంటపై కత్తితో దాడి

208
Attack on lovers
- Advertisement -

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో ఈ ఘటన జరిగింది.. సందీప్‌, మాధవి పెద్దలను ఎదురించి వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బుధవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ వద్ద ఉండగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సందీప్‌ తీవ్రంగా గాయపడగా, మాధవికి చేయి, మెడపై గాయాలయ్యాయి.

Attack on lovers

దాడి ఘటన తర్వాత యువతిని దూషిస్తూ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన దంపతులను సనత్‌ నగర్‌లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే దాడికి పాల్పడింది మాధవి తండ్రేనని అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -