- Advertisement -
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ బి.ఆర్ గవై, జస్టిస్ బి.వి నాగరత్న ధర్మాసనం. రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల డీల్‌తో ముందుకొచ్చిన వ్యవహారంలో ఆడియో క్లిప్ కీలకంగా మారింది. ఇక ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం వీడియో క్లిప్‌ను సైతం న్యాయస్ధానానికి అందజేసింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -