- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉదృతంగా మారింది. నేటి నుండి రహదారుల నిర్బంధం చేపట్టనున్నారు రైతులు. ఇవాళ జైపూర్-ఢిల్లీ రహదారిని నిర్బంధించేందుకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టేందుకు సిద్దమయ్యారు. , 14న నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుంచి భారీగా రైతులు తరలివస్తున్నారు. ఈ నెల 16న 500 ట్రాలీల్లో ఇక్కడికి రైతులు చేరుకుంటారని రైతు సంఘాల నేతలు తెలిపారు.
ఈ నెల 19వతేదీ లోపు తమ డిమాండ్లకు ఒప్పుకోవాలని రైతు సంఘం నేతలు అల్టీమేటం విధించారు. మరో వైపు ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ వద్ద రైతుల ఆందోళన 18వ రోజు కొనసాగింది.
- Advertisement -