తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఆయన స్టైలే వేరు. ఎన్ని జనరేషన్ లు మారినా ఆయన మాత్రం సమాజానికి ఉపయోగ పడే సినిమాలే తీస్తాడు. ముక్కు సూటిగా మట్లాడే మనిషి ఆర్ . నారాయణ మూర్తి. పేద ప్రజల కష్టాలన్ని తన సినిమాల రూపంలో చూపిస్తుంటాడు. ఇక తాజాగా అతను తీస్తున్న సినిమా అన్నదాత సుఖీభవ. రైతుల జివితాలపై ఈసినిమాను తీసినట్టు తెలిపారు నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి. రైతు బాగుంటే దేశంమొత్తం బాగుటుందన్నారు.
రైతుల కష్టసుఖాలపై తీసిన ఈ సినిమానే అన్నదాత సుఖీభవ అన్నారు. రైతు శ్రమకు, పెట్టిన పెట్టబడికి అదనంగా యాభై శాతం లాభం చేకూర్చేలా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలిని 2007లో డా. స్వామినాథన్ కమిటి సీఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఆ చట్టాన్ని అమలు పరుస్తే రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టనటువంటి సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ చేపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల పట్ల డా.స్వామినాథన్ సీఎం కేసీఆర్ ను అభినందించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంథు, రుణమాఫీ, 24గంటల విద్యుత్ ఇలాంటి పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ కేసీఆర్ తన జన్మను సార్ధకం చేసుకుంటున్నారన్నారు. రైతుల పట్ల ప్రభుత్వాలు ఎలాంటి ఆలోచనలు తీసుకొవాలో..రైతులకు ఎలాంటి న్యాయం చేయాలో తగిన విషయాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు.
ఇక ఈ సినిమాలో ఆర్. నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటిస్తూ స్నేహ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18వ తేదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో ప్రముఖ రచయితలు, గాయకులు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, గద్దర్ లాంటి ప్రముఖులు పాటలు రాశారు.