సీఎం కేసీఆర్‌కు అండగా నిలవండి: ఎమ్మెల్యే సండ్ర

110
mla sandra
- Advertisement -

రాయల సీమ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రైతుల సీఎం కెసిఆర్ పోరాటం చేస్తున్నారని ఆయనకు అండగా నిలవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నామనిచెప్పారు . తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేస్తున్నారని, రైతులంతా అండగా నిలవాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు ..

గతంలో కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు వద్ద ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని అన్నారు. కాలం కలిసి వచ్చి సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల నాగార్జునసాగర్ లో జలాలు సమృద్ధిగా ఉండటంతో రెండు సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దిగువనున్న నల్గొండ, ఖమ్మం జిల్లాలో పంటలు సాగు ఆశాజనకంగా ఉందన్నారు. జల పంపిణీకి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివైఖరి తో తిరిగి రాయలసీమ నీటి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల NSP ప్రాజెక్టు 2 వ జోన్ పరిధిలోని వ్యవసాయ భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకొవాని సండ్ర డిమాండ్ చేశారు .. బీజేపీ నాయకులు కనీసం స్పందించకపోవడం బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు.

- Advertisement -