రామన్నపై యువరైతు అభిమానం…

127
ktr minister
- Advertisement -

మంత్రి కేటీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన యువరైతు. రామన్నపై ప్రేమతో తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచి..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రామ‌డుగు మండ‌లం వెదిర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ కార్య‌క‌ర్త శ‌నిగార‌పు అర్జున్‌కు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. దీంతో గ‌తేడాది కూడా త‌న పొలంలో KTR అనే అక్ష‌రాల ఆకారంలో నారు పోసి, పెంచి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా రెండో సారి కూడా రామన్నపై అభిమానంతో నారు పోసి పెంచగా ఆ నారు పెర‌గ‌డంతో.. KTR అనే అక్ష‌రాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -