మూగజీవం పట్ల క్రూరత్వం..జరిమానా!

3
- Advertisement -

ఎండలు మండిపోతున్న వేళ మానవత్వం మరచి ప్రవర్తించిన ఒక వ్యక్తికి ఫరీదాబాద్ అధికారులు గట్టి గుణపాఠం చెప్పారు. తన పెంపుడు కుక్కను కనీసం నీడ కూడా లేని చోట, మండుతున్న ఎండలో గంటల తరబడి కట్టేసినందుకు గానూ సదరు వ్యక్తికి రూ. 1,000 జరిమానా విధించారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను ఇంటి బయట ఎండలో కట్టేశాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్న తరుణంలో, ఆ మూగజీవం ఎండ వేడికి తట్టుకోలేక విలవిలలాడింది. ఈ దృశ్యాన్ని గమనించిన ఒక జంతు ప్రేమికుడు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందగానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు జంతు సంరక్షణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద ఆ వ్యక్తికి రూ. 1,000 జరిమానా విధించారు.భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కుక్కను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్

వేసవి కాలంలో పెంపుడు జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జంతు సంరక్షకులు కోరుతున్నారు.జంతువులకు ఎప్పుడూ చల్లని నీరు అందుబాటులో ఉంచాలి.వాటిని గాలి ఆడే నీడ ప్రదేశాలలో ఉంచాలి.మధ్యాహ్నం వేళల్లో బయట తిప్పడం లేదా కట్టేయడం చేయకూడదు.జంతువులకు భాష ఉండదు కానీ భావాలు ఉంటాయి. ఎండల తీవ్రత మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ప్రాణాంతకం కావచ్చు అని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -