- Advertisement -
కింగ్ నాగార్జున హీరోగా గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. నాగలక్ష్మి పాత్రలో తాజాగా విడుదలైన ఆమె గ్లామరస్ లుక్కుకి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ మాంచి ఐటం సాంగ్ ఉందట. ఇందుకోసం ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లాను తీసుకున్నట్టు తాజా సమాచారం. మామూలుగానే ఫరియాకు మంచి డ్యాన్సర్‌గా పేరుంది.
నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేయడం కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఫరియా. మొత్తానికి తక్కువ టైంలోనే సీనియర్ హీరో సినిమాలో నటించే అరుదైన అవకాశం కొట్టేసింది ఫరియా అబ్దుల్లా. మరి ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగులో ఆమె డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలి!
- Advertisement -